ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అందరికీ అదర్శం ఆ గురుకులం.. ఎందుకంటే..?! - గుంటూరులో గురకల పాఠశాల వార్తలు

అక్కడ ఉపాధ్యాయులంటే.. పాఠాలు చెప్పే గురువులే కాదు.! పిల్లల బాగోగులు చూస్తూ.. వారి అవసరాలు తీర్చే నేస్తాలు కూడా! ప్రభుత్వాలు ఇచ్చే డబ్బుతోపాటు నెలనెలా వచ్చే వేతనంలో కొంత సొమ్మను విద్యార్థుల కోసం వెచ్చిస్తారు. అందుకే ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, పచ్చదనం, పరిశుభ్రతకు కొదవ లేదు. నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలున్న ఆ గురుకులం.. మిగతా వారికీ అదర్శం నిలుస్తోంది. ఇంతకీ ఆ గురుకులం ఎక్కడుందో తెలుసా..?

Vinukonda Gurukulam school
Vinukonda Gurukulam school

By

Published : Mar 13, 2022, 2:49 PM IST

చుట్టూ పచ్చదనం, పరిశుభ్రత. ఎటుచూసినా అందమైన బొమ్మలు. నేలపై పాఠ్యాంశాల్లోని బొమ్మలు, చిత్రాలు. స్ఫూర్తి పొందేందుకు మహనీయుల విగ్రహాలు. ఇది గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణం. మూస విధానంలో బోధనకు బైబై చెపిన ఉపాధ్యాయులు... పిల్లలకు కొత్త తరహా బోధన అందిస్తున్నారు. పిల్లలూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 53 మంది విద్యార్థినులు మంచి ఫలితాలను సాధించారు. రాష్ట్రస్థాయి ఆన్‌లైన్‌ క్విజ్‌లో ఇక్కడి విద్యార్థులు రెండుసార్లు విజేతగా నిలిచారు. జపనీస్‌ భాషనూ ఇక్కడ పిల్లలకు నేర్పుతున్నారు.

అందిరికీ అదర్శం ఆ గురుకలం.. ఎందుకంటే..!

షేరింగ్‌ లవ్‌పేరుతో ..
మూడేళ్ల కిందట ఆ విద్యాలయానికి బదిలీపై వచ్చిన ప్రిన్పిపాల్‌ వెంకటమ్మ చొరవతో మిగతా సిబ్బంది సమష్టితత్వంతో గురుకులాన్ని ముందుండి నడిపిస్తున్నట్లు వివరిస్తున్నారు. షేరింగ్‌ లవ్‌పేరుతో ఓ పెట్టె ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది అందులో జీతాలు వచ్చాక తమకు నచ్చినంత డబ్బులు వేస్తారు. ఈ డబ్బుతో పిల్లల అవసరాలు, వసతలతో పాటు..ప్రభుత్వం ఇచ్చే మెనూ కంటే అదనంగా బఫే మీల్స్‌ తరహాలో స్వీట్లు, పళ్లు విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని అంటున్నారు.

ఇక్కడ పనిచేసి ఉపాధ్యాయులు.. విద్యార్థులను కుటుంబ సభ్యులగా భావిస్తారు. మేము షేరింగ్‌ లవ్‌పేరుతో ఓ బాక్స్​ను ఏర్పాటు చేశాం . ఉపాధ్యాయులకు జీతాలు రాగానే వాళ్లకు తోచినంతా అందులో వేస్తారు. దానిని పిల్లల కోసం ఉపయోగిస్తాం. - వెంకటమ్మ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌

నేలపైనే చిత్రాలు..
గురుకులంలో నేలపైనే పాఠ్యాంశాలకు సంబంధించి చిత్రాలను సిమెంట్‌తో శాశ్వతంగా ఏర్పాటు చేశారు. భారతదేశ పటం, రాష్ట్రాలు, రాజధానులు, జీవవైవిధ్యం, అక్షాంశాలు, రేఖాంశాలు, సైన్సులో ఆర్బిటాల్స్‌ చిహ్నాలను ఇక్కడ నిర్మించారు. ఇవి తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.

నేలపైన శాశ్వతంగా చిత్రాలకు గీయించటం ద్వారా మేము అటుగా వెళ్లినప్పడల్లా వాటిని చూస్తాం. చెప్పటం కన్నా చూడటం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంటుంది.- విద్యార్థులు

అశయాలను ఆచరించి చూపిస్తున్న వినుకొండ గురుకుల ఉపాధ్యాయుల కృషిని అందరూ అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి :ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. సాయం కోసం!

ABOUT THE AUTHOR

...view details