సహారా ఇండియా పరివార్‌లో డిపాజిట్ చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ... గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. డిపాజిట్ చేసిన సొమ్మును చెల్లించాలని కోరినా...సంస్థ పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని బాధితులు వాపోయారు. అలాకాకుంటే రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
'సహారా ఇండియా పరివార్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి' - government should support the victims of the Sahara India
సహారా ఇండియా పరివార్‌లో డిపాజిట్ చేసిన బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
సహారా ఇండియా పరివార్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
TAGGED:
గుంటూరు జిల్లా వార్తలు