ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: నాదెండ్ల - జనసేన నేత నాదెండ్ల మనోహర్ వార్తలు

వరదలతో పంట నష్టపోయిన కర్షకులకు సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైకాపా సర్కారు... గత ఏడాది వరదల వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.

nadendla manohar
nadendla manohar

By

Published : Oct 17, 2020, 10:11 PM IST

వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దసరా మహోత్సవాలను నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు.

అంతకు ముందు పార్టీ నాయకులతో మనోహర్ సమావేశమయ్యారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో పార్టీ నాయకులు ప్రజలకు చేసిన సేవను పవన్ కళ్యాణ్ అభినందించారన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైకాపా సర్కారు గత ఏడాది వరదల వల్ల నష్టపోయిన వారికి ఇంతవరకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి లంక గ్రామాల్లో పర్యటిస్తున్నామని మనోహర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details