గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇసుక నిల్వకేంద్రాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇసుక గురించే మాట్లాడుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు సిమెంట్లాగా ఇసుకను సంచుల్లో తీసుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అక్టోబర్ 2లోగా ఇసుక సమస్యను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించాలని...లేకుంటే ఇసుక నిల్వ కేంద్రాల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై అన్నిపార్టీల నేతలతో కలిసి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
"అక్టోబర్ 2లోగా.. ఇసుక సమస్యను పరిష్కరించండి"
అక్టోబరు 2లోగా ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని...లేదంటే ఇసుక నిల్వ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.
మంగళగిరిలో ఇసుక కొరతపై స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ