రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. రూ.12 వేల కోట్లతో 45 వేలకు పైగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి బడిలో ఇంగ్లిష్ ల్యాబ్, 9 రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సీఎస్‌ఆర్ కింద సాయం చేసేవారి పేర్లు కూడా పెడతామన్నారు.
ప్రభుత్వంతో పలు సంస్థల అవగాహన ఒప్పందం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కనెక్ట్ టు ఆంధ్ర పేరిట హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్, రెయిన్ కార్బన్ కార్పొరేట్ సంస్థల తోడ్పాటును ఇవ్వనున్నాయి. ఈ ఐదు సంస్థలు 2వేల 566 పాఠశాలల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. కడప జిల్లాలో రూ.20 కోట్లతో 402 బడులను హెటిరో సంస్థ అభివృద్ధి చేయనుండగా... పశ్చిమగోదావరి జిల్లాలో రూ.21 కోట్లతో 428 బడులను వసుధ ఫార్మా అభివృద్ధి చేయనున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో 66 బడులను రెయిన్ కార్బన్, శ్రీకాకుళం జిల్లాలో రూ.25 కోట్లతో 281 బడులను ఆదిలీల ఫౌండేషన్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 359 పాఠశాలలకు మౌలిక వసతులకు లారస్ ల్యాబ్స్ రూ.18 కోట్లు ఖర్చు చేయనుంది.
ఇదీ చూడండి:
మూడు రాజధానుల నిర్ణయంపై 29 గ్రామాల్లో బంద్