CM jagan tour in prathipadu: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు గుంటూరు గ్రామీణ మండలం నుంచి ప్రజలను తరలించాల్సిందిగా ఎంపీడీవో కార్యాలయం నుంచి అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బందికి సర్క్యులర్ జారీ చేశారు. రూరల్ మండల వ్యాప్తంగా పింఛనుదారులు, పొదుపు సంఘాల సభ్యులను సభా వేదిక వద్దకు జనవరి 1న ఉదయం 8 గంటలకు తీసుకురావాలని దానిలో పేర్కొన్నారు. డిసెంబర్ 31న సాయంత్రం మండలంలోని అన్ని గ్రామాలకు బస్సులు వస్తాయని, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వాటిలో తీసుకురావాల్సిన బాధ్యత అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టంగా పేర్కొన్నారు. బహిరంగ సభకు ప్రజలను బస్సుల్లో తరలించాలని ఏకంగా సర్క్యులర్ జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గ్రామీణ మండలం ఎంపీడీవో వి.సుజాతను ‘వివరణ కోరగా తాను నాలుగు రోజులుగా సెలవులో ఉన్నానని, ఈవోఆర్డీకి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా పొరపాటున సర్క్యులర్ జారీ అయినట్లు చెప్పడం గమనార్హం.
బహిరంగ సభకు అంతా సిద్ధం..