రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశలవారీ మద్యపాన నిషేధానికి అనుగుణంగా.. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. కానీ.. ఆ దుకాణాల్లో పని చేసే కొందరు సిబ్బంది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బోసు రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సమీపంలోని బార్ షాపుకు అక్రమంగా తరలిస్తున్నారు.
దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లు మన్యం సూరిబాబు, అబ్దుల్ సాదిక్, బాల నారాయణ.. బార్కి మద్యం సరఫరా చేశారు. ఈ దందాలో బార్ ఉద్యోగి వి. సత్యప్రసాద్ సమన్వయం చేశారు. సెబ్ అధికారులు వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. సహకరించిన ఆటోడ్రైవర్ సిహెచ్ విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా... ఐదుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు సూపరింటెండెంట్ నరసింహారావు తెలిపారు.