AP Three Capitals Issue: రాజధాని కేసుల సత్వరం విచారణకు తేదీ ప్రకటించాలని కోరేందుకు.. ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అవకాశం కల్పించాలని.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సోమవారం జస్టిస్ కె.ఎం.జోసఫ్ నేతృత్వంలోని బెంచ్ వద్ద మెన్షన్ చేసేందుకు అనుమతించాలని రిజిస్ట్రీని కోరారు. సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీ ఈ మేరకు.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు మెన్షనింగ్ లేఖను అందించారు. అమరావతిపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మళ్లీ చట్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనాధికారం లేదని పేర్కొన్న విషయాన్ని తన లేఖలో ప్రస్తావించారు.
రాజధాని కేసుల విచారణకు తేదీ ప్రకటించండి.. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
Three Capitals Issue: రాజధాని కేసుల సత్వరం విచారణకు.. తేదీ ప్రకటించాలని కోరేందుకు ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు.. అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సోమవారం జస్టిస్ కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని బెంచ్ వద్ద మెన్షన్ చేసేందుకు అనుమతించాలని రిజిస్ట్రీని కోరారు.
రాజధాని రైతు పరిరక్షణ సమితి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వాజ్యంలో గత ఏడాది నవంబరు 28న తొలిసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. కాలపరిమితితో కూడిన నిబంధనలపై మాత్రమే స్టే విధిస్తూ సమాధానం చెప్పాలని కేంద్రం సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు అదేరోజు ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 6 నెలల కాలపరిమితిలో చేపట్టాల్సిన నిబంధన వల్ల ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ వస్తుంది కాబట్టి.. సంబంధిత 6 అంశాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 31న జరగాల్సి ఉన్నప్పటికీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఉన్నందున ఆ రోజు అమరావతి పిటిషన్లు వాయిదాపడ్డాయి. తదుపరి విచారణ ఈనెల 7న వచ్చే అవకాశం ఉన్నట్లు కేసుల జాబితా వివరాల్లో రిజిస్ట్రీ పేర్కొంది. అయినా కేసు త్వరితగతిన విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసేందుకు అవకాశం కల్పించాలని రిజిస్ట్రీని కోరింది.
ఇవీ చదవండి: