ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉగాదికి పేదలకు ఇళ్లపట్టాలు.. కమిటీ ఏర్పాటు - Free house site distribution

పేదలకు ఇళ్ల పట్టాలు అందించే విధానంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పేదలకు ఇళ్లపట్టాలు అందించే విధానంపై కమిటీ ఏర్పాటు

By

Published : Jul 26, 2019, 5:31 PM IST

వచ్చే ఏడాది ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్లపట్టాలు అందించే విధానంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం... సభ్యులుగా గృహనిర్మాణ, ఆర్ధిక, సామాజిక సంక్షేమశాఖ కార్యదర్శులను నియమించింది. కమిటీ కన్వీనర్‌గా భూపరిపాలన శాఖ ప్రత్యేక కమిషనర్​ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details