ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు విఫలం - వేతనాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన సర్కార్

Government_Discussions_With_Anganwadis
Government_Discussions_With_Anganwadis

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 8:12 PM IST

Updated : Dec 15, 2023, 10:02 PM IST

20:11 December 15

సమ్మె కొనసాగించాలని అంగన్వాడీల నిర్ణయం

Government Discussions With Anganwadis Failed:పాదయాత్ర సమయంలో జగన్ తమలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు గత కొన్ని రోజులుగా నిరసనలు (Anganwadis protests in AP) చేస్తున్నారు. తాజాగా వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీలకు వేతనాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీల నిర్ణయించుకున్నారు.

Anganwadi Workers and Helpers Union State President:జీతాలు పెంచేదే లేదని ప్రభుత్వం పదే పదే చెబుతోందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ధ్వజమెత్తారు. అందరికీ పౌష్టికాహారాన్ని అందించే తాము తమ పిల్లలకే పౌష్టికాహరం పెట్టుకునేలా జీతాలు లేవని మండిపడ్డారు. ప్రభుత్వం తమపై బెదిరింపులకు పాల్పడుతోందని, అంగన్వాడీ సెంటర్ల తాళాలు రాత్రి వేళల్లో పగలకొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలు కొట్టాలనుకుంటే గర్బిణులు, ప్రజలే అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు తెలిపారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం రేపు సమస్య పరిష్కరిస్తే ఎల్లుండి విరమిస్తామని మంత్రికి చెప్పామన్నారు. జీతాలు పెంచమని ప్రభుత్వం పదే పదే చెప్పిందని జీతాల పెంపు సాధ్యం కాదు డబ్బులు లేవన్నారని నరసింగరావు తెలిపారు. ప్రధానమైన జీతం, గ్రాట్యుటీ వంటి విషయాల్లో పురోగతి లేదని వాపోయారు. అంగన్వాడీ సమస్యలపై మంత్రులు వెంటనే సీఎం జగన్​తో చర్చించాలని కోరుతున్నమన్నారు.

అంగన్వాడీ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు:అంగన్వాడీలు సమ్మె విరమిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చించామన్న బొత్స కొన్ని డిమాండ్లు అంగీకరించామని ఇంకొన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని బొత్స చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.

Anganwadis strike for fourth day in AP:సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నాలుగో రోజూ ఉద్ధృతంగా సాగింది. చాలీచాలనీ వేతనాలతో కుటుంబపోషణ కష్టమైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. వీరికి వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.

Last Updated : Dec 15, 2023, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details