Minister Rk Roja: జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాచీన కళలను ప్రజలకు తెలియజేస్తూ.. ఆయా కళాకారులను గుర్తించేందుకే సంబరాలను నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారుల వివరాలను సేకరిస్తున్నామని రోజా తెలిపారు.
గుంటూరులో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు.. నృత్యం చేసిన మంత్రి రోజా - government celebrated Jagan anna
Rk Roja: గుంటూరులో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె కళాకారులతో కలిసి చిందేశారు.
మంత్రి ఆర్కే రోజా
నటి అయిన నేను కళారంగానికి సేవ చేయాటానికి.. పేద కళాకారులను ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జానపద, డప్పు నృత్యాలను మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీక్షించారు. జానపద కళాకారులతో కలిసి మంత్రి రోజా నృత్యం చేశారు.
ఇవీ చదవండి: