AP Government advisor Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా ఆయన కుటుంబాన్ని ఇరికించడమే లక్ష్యంగా కుట్ర పూరితంగా కేసు విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2024 ఎన్నికల నాటికి జగన్ క్యారెక్టర్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ కు ఆయన కుటుంబానికి లింక్ కలిపే దుర్బుద్దితో నీచ రాజకీయం చేస్తున్నారన్నారు. వివేకా హత్య వ్యవహారంలో సీఎం జగన్‌పై అనుమానాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీలో ఉన్న స్లీపర్ సెల్స్ సీబీఐ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలోని స్లీపర్ సెల్స్ సీబీఐ వెనకుండి పని చేయిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ స్లీపర్ సెల్స్ అంతా గతంలో చంద్రబాబు కింద తర్పీదు పొందిన వారేనన్నారు. సీబీఐ విచారిస్తోన్న నవీన్ జగన్‌కు అంటెండర్‌గా ఉన్నారని.. కృష్ణమోహన్ రెడ్డి జగన్‌కు ఓఎస్డీగా పని చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ వద్ద ఫోన్ లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉన్న నవీన్ లేదా కృష్ణమోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకా హత్య విషయాన్ని చెప్పారని సజ్జల తెలిపారు. ఇందులో అసహజంగా, సంచలనాత్మకంగా ఏముందని ప్రశ్నించారు. ఏదో జరిగిపోయినట్లు, కుట్ర కోణం ఉన్నట్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన విషయాన్నే వైఎస్ జగన్‌కు అవినాష్ చెప్పారన్నారు. వివేకా హత్య జరిగిన విషయం తొలి సమాచారం వివేకా అల్లుడు, బావమరిది రాజశేఖరరెడ్డికే వెళ్లిందని, వివేకాది అనుమానాస్పద మృతి అని తెలిసినా వారు పోలీసులకు చెప్పకుండా ఎందుకు దాచారని సజ్జల ప్రశ్నించారు. వివేకా హత్య గురించి తొలుత అవినాష్ రెడ్డే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారన్నారు. వివేకా స్వయంగా రాసిన లేఖ గురించి వివేకా బావమరిది రాజశేఖరరెడ్డి, అల్లుడు పోలీసులకు ఎందుకు చెప్పలేదన్నారు. అవినాష్‌కు ఫోన్ చేశాకనైనా శివప్రకాశ్ రెడ్డి వెంటనే పోలీసులకు ఎందుకు చెప్పలేదన్నారు. వివేకా హత్య కేసులో సూత్రదారులు, పాత్రదారులు చాలా మంది ఉన్నారని సజ్జల వెల్లడించారు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టినప్పడు సీబీఐ ధోరణి ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. అప్పట్లో సీబీఐ అధికారులు ముందుగా మీడియాకు చెప్పి తర్వాత విచారించేవారని, ఇప్పుడు సైతం నోటీసుల విషయాన్ని మెుదట మీడియాకు చెప్పి ఆ తర్వాత విచారిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివేకా హత్య జరిగిన విషయం అవినాష్ రెడ్డికి తెలిసి ఆ విషయాన్ని జగన్‌కు చెప్పడానికి ఫోన్ చేశారు. వైఎస్ జగన్ వద్ద ఫోన్ లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉన్న వారికి అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకా హత్య విషయాన్ని చెప్పారు. ఇందులో అసహజంగా, సంచలనాత్మకంగా ఏముంది. ఏదో సంచలనం జరిగిపోయినట్లు, కుట్ర కోణం ఉన్నట్లు అంటున్నారు. -సజ్జలరామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి: