ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలకలం రేపిన పీహెచ్​సీ ఫార్మాసిస్ట్​ వాట్సప్​ స్టేటస్ - గొట్టిపాడు పీహెచ్​సీ వాట్సప్​ స్టేటస్ కలకలం

పీహెచ్​సీ వైద్యాధికారి అవమానిస్తుండటంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సంధ్య అనే ఫార్మసిస్ట్ వాట్సప్​ స్టేటస్​ పెట్టింది. విషయం గమనించిన తోటి సిబ్బంది.. వాలంటీర్​ను ఆమె ఇంటికి పంపించి బలవన్మరణం చేసుకోకుండా ఆపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఈ ఘటన జరిగింది.

gottipadu phc medical officer, gottipadu phc pharmacist whatsapp statsu issue
గొట్టిపాడు పీహెచ్​సీ వైద్యాధికారి, గొట్టిపాడు పీహెచ్​సీ ఫార్మసిస్ట్ వాట్సప్​ స్టేటస్ కలకలం

By

Published : Mar 27, 2021, 8:03 PM IST

ఆరోపణలపై వివరణ ఇస్తున్న వైద్యాధికారి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్ సంధ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నాని వాట్సప్ స్టేటస్ పెట్టడం కలకలం రేపింది. పీహెచ్​సీ వైద్యాధికారి రత్నశ్రీ తనను అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించింది. అందరూ తనను చూసి నవ్వుతున్నారని, మరణించే వరకు ఆమె వదలదు కాబట్టి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు స్టేటస్ పెట్టుకుంది.

విషయం గమనించిన పీహెచ్​సీ సిబ్బంది వెంటనే వాలంటీరుకు సమాచారం ఇచ్చి.. ఆమెను ఇంటికి పంపించి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. పని చేయమని చెప్పడం మినహా తానేమీ అనలేదని వైద్యాధికారి రత్నశ్రీ చెబుతున్నారు. ఓపీలో ఇద్దరి పేర్లు మినహా మిగిలినవి ఎందుకు రాయలేదని మాత్రమే అడిగినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందిస్తారని ఆమె తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details