ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సరకులోడింగ్​లో గుంటూరు రైల్వే డివిజన్ వృద్ధి

By

Published : Nov 20, 2020, 6:51 AM IST

సరకు లోడింగ్​లో గుంటూరు రైల్వే డివిజన్ గణనీయ వృద్ధి సాధించింది. గతేడాదితో పోల్చిచూస్తే సరకు లోడింగ్ లో 102 శాతం అధికవృద్ధి నమోదైంది.

సరకులోడింగ్​లో గుంటూరు రైల్వే డివిజన్ వృద్ధి
సరకులోడింగ్​లో గుంటూరు రైల్వే డివిజన్ వృద్ధి

గుంటూరు రైల్వే డివిజన్​లో నవంబర్ 12 నాటికి 1.56 మిలియన్ టన్నులు లోడింగ్ కాగా....గత సంవత్సరం ఇదే కాలంలో 0.77 మిలియన్ టన్నులే లోడింగ్ జరిగినట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. కరోనావేళ వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ధాన్యాల లోడింగ్ రవాణాపై రైల్వే శాఖ అధికారులు దృష్టి సారించారు. డివిజన్ నుంచి బంగ్లాదేశ్​కు మిర్చి ఎగుమతులు ప్రారంభించగా...ఈ ఏడాది 12 సరకు రవాణా రైళ్లు, 11 పార్సిల్ రైళ్ల ద్వారా ఎగుమతి చేశారు. నాగిరెడ్డిపల్లి స్టేషన్ నుంచి 51 రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, నంద్యాల, నడికుడి, రెడ్డిపాలెం నుంచి 12 రైళ్ల ద్వారా మొక్కజొన్న ఉత్పత్తులను లోడింగ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details