ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య సిబ్బంది, ఏఎన్​ఎంలకు నిత్యావసరాలు పంపిణీ - తాడికొండ ఎమ్మెల్యే శ్రీ దేవి

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు. ఫిరంగిపురంలో అత్యవసర సేవలందిస్తున్న వారికి ఆమె నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

goods distribution for muncipal workers, anm, aha workers in firangipuram
కూరగాయలు పంపిణీ చేస్తోన్న ఎమ్మెల్యే శ్రీదేవి

By

Published : Apr 18, 2020, 7:27 AM IST

కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు నిత్యావసరాలు, కూరగాయలు, బియ్యం అందించారు. ప్రజలంతా వ్యక్తిగత దూరం పాటించాలని.. లాక్​డౌన్​ నిబంధనలను అనుసరించాలని సూచించారు. అనంతరం స్థానిక వైకాపా నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు.

ABOUT THE AUTHOR

...view details