ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కార్యాచరణ ప్రారంభమైంది. వివిధ శాఖల్లో ఒప్పంద సిబ్బంది వివరాల నమోదుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్యారోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద సిబ్బంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. విద్యాశాఖ, అటవీ, గిరిజన సంక్షేమం, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు తీసుకుంటున్నారు. ఆయా శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు...తర్వాత సీఎస్‌తో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉన్నతస్థాయిలో సమావేశ నిర్ణయాలను మంత్రుల కమిటీకి ప్రభుత్వం నివేదించింది.
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు శుభవార్త - ఏపీలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా మరో ముందడుగు పడింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. అలాగే ఆయా శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ap secretariat