ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా' - గోనుగుంట సూర్య నారాయణ వార్తలు

అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్​కు సంబంధించి తనపై వస్తోన్న ఆరోపణలపై భాజపా నేత సూర్యనారాయణ స్పందించారు. ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చన్నారు.

surya narayana
surya narayana

By

Published : Feb 8, 2020, 7:30 PM IST

మీడియాతో మాట్లాడుతున్న భాజపా నేత సూర్య నారాయణ

రాజధాని ప్రాంతంలో తాను ఇన్​సైడర్​ ట్రేడింగ్​కి పాల్పడినట్లు నిరూపిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ అన్నారు. తాను అమరావతి ప్రాంతంలో 50 ఎకరాల భూములు కొన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కొంతమేర భూములు కొనుగోలు చేసింది 2016-17 సంవత్సరాల్లో అని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో భూములు కొంటే ఇన్​సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే ఏ సంస్థతో అయినా విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు. అలాగే 2014 ముందు తాను ఇసుక అక్రమ రవాణా చేశారని వార్తలు వస్తున్నాయన్న ఆయన.... వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details