Gold ATM in Hyderabad : దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను శనివారం హైదరాబాద్ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం ఒక ఉదాహరణని ఆమె అభివర్ణించారు.
గోల్డ్ ఏటీఎం @ హైదరాబాద్.. ఎప్పుడంటే అప్పుడే బంగారం డ్రా - Gold ATM
Gold ATM in Hyderabad : సాధారణంగా డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రాలను వినియోగిస్తారు. కానీ బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చని మీకు తెలుసా. అవునండీ.. ఇది నిజం. పుత్తడిని కూడా ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే. బేగంపేటకు వెళ్తే దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం నుంచి మీరూ ఎంచక్కా బంగారాన్ని డ్రా చేసుకోవచ్చు.
ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.
ఇవీ చదవండి: