ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gold chain robbery in guntur: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి.. బంగారం అపహరణ - గణపవరంలో దొంగతనం

ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడి.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన ఘటన గుంటూరు జిల్లా (Gold chain robbery in guntur) నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో జరిగింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని.. చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Gold chain robbery in nadendla at guntur district
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి.. బంగారం అపహరణ

By

Published : Nov 27, 2021, 4:38 PM IST


ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి తల పగలగొట్టి.. బంగారు గొలుసు లాక్కున్న సంఘటన నాదెండ్ల మండలం గణపవరంలో(Gold chain robbery in guntur) జరిగింది. పుట్టా సామ్రాజ్యం(65), ఓబయ్య దంపతులు గణపవరంలోని పద్మశాలి వీధిలో నివాసం ఉంటున్నారు. గ్రామంలోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద కిళ్లీకొట్టు నిర్వహిస్తున్నారు.

శనివారం ఉదయం ఓబయ్య దుకాణం వద్దకు వెళ్లగా.. సామ్రాజ్యం ఇంటి వద్దే ఉంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఓబయ్య దుకాణం వద్దకు వెళ్లి సిగరెట్లు కొనుగోలు చేశారు. ఇంట్లో సామ్రాజ్యం ఒంటరిగా ఉందన్న విషయం గమనించి.. ఓబయ్య ఇంటి వద్దకు సర్వేకు వెళ్లినట్లు వెళ్లి సామ్రాజ్యంను పిలిచి ఆమెపై దాడికి పాల్పడ్డారు.

అనంతరం ఆమె మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన సామ్రాజ్యం.. చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

TTD TICKETS ONLINE TODAY: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల.. పది నిమిషాల్లోనే ఖాళీ..!

ABOUT THE AUTHOR

...view details