ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ బంగారం తనఖా పెట్టి రూ.40 లక్షలు స్వాహా - గుంటూరు జిల్లా వార్తలు

బ్యాంకు అప్రైజర్.. బంగారం తనఖా పెట్టేటప్పుడు అది ఎంత బరువుంది..? అసలు బంగారమా..? నకిలీనా..? ఈ విషయాలను ధృవీకరించాల్సిన బాధ్యతను నిర్వహిస్తారు. దీనినే ఓ బ్యాంకుకు చెందిన అప్రైజర్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఐదుగురు సభ్యులతో కలిసి కుమ్మక్కయ్యాడు. వన్ గ్రామ్ గోల్డ్​ను అసలు బంగారంగా తనఖా పెట్టి బ్యాంకు నుంచి ఏకంగా రూ. 40 లక్షలు స్వాహా చేశాడు.

gold appraiser
gold appraiser

By

Published : Jul 17, 2020, 3:33 PM IST

నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకుని రుణం ఇచ్చి బ్యాంకును మోసగిస్తున్న అప్రైజర్ పై గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు అయింది. హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి బ్రాడీపేటలోని బ్యాంకు ఆఫ్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా అప్రైజర్ గా పని చేస్తున్నారు. ఆయన సోదరుడు రామకృష్ణ మోహన్ బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఆ ఇద్దరు బ్రాడీపేట, కొత్తపేట, శ్రీనగర్, పొన్నూరుకు చెందిన అయిదుగురితో కలిసి కుమ్మక్కయ్యారు.

వన్ గ్రామ్ బంగారు ఆభరణాలు బ్యాంకులో తనఖా పెట్టి 40 లక్షలు రుణం పొందారు. దీనికి బ్యాంకు అప్రైజర్ హరికృష్ణ ప్రసాద్ పూర్తిగా సహకరించాడు. వన్ గ్రామ్ బంగారు ఆభరణాలు కుదవ పెట్టుకుని బ్యాంకును మోసగించినట్లు మేనేజర్ దివ్యాన్షు కుమార్ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చదవండి:అయోధ్య రామాలయంపై రేపు కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details