ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగర తీరాన్ని శుభ్రపరిచిన  గో గ్రీన్ సభ్యులు - suryalanka beach cleaning

సముద్రతీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని గో గ్రీన్ సభ్యులు ప్రారంభించారు. కొవిడ్​ కారణంగా సముద్రం ఒడ్డున పరిశుభ్రత పనులను పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు వారి సహకారంతో నిర్వహించారు.

Suryalanka beach in Bapatla,
గో గ్రీన్ సభ్యులు

By

Published : Oct 18, 2020, 12:27 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సాగర తీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని గో గ్రీన్ సభ్యులు ప్రారంభించారు. కరోనా కారణంగా గత ఆరు మాసాలుగా పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు తీరం మెుత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ కార్యక్రమాన్ని గో గ్రీన్ సభ్యులు, బాపట్ల పురపాలక సంఘం పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు వారి సహకారంతో ఏర్పాటు చేశారు. ఇందులో ఉప సభాపతి కోన రఘుపతి, బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details