ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్వచ్ఛ గుంటూరు సాధనకు ప్రజలంతా సహకరించాలి' - gmc latest news

స్వచ్ఛ గుంటూరు సాధనకు ప్రజలందరూ సహకరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పెషల్ అధికార్లు, నోడల్ అధికార్లతో 'నగరంలో తడి పొడి చెత్త విభజన, హోం కంపోస్ట్ పారిశుద్ధ్యం'పై సమీక్షించారు.

gmc meeting on Wet- dry garbage separation in the city
స్వచ్ఛ గుంటూరు సాధనకు ప్రజలందరూ సహకరించాలి

By

Published : Nov 28, 2020, 10:25 PM IST

మరో వారం రోజుల్లో నగరంలో నూరు శాతం వ్యర్థాలు తడి - పొడి విభజన జరగాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని ప్రతి ఇంటికి, సంస్థలకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పెషల్ అధికారులు, నోడల్ అధికార్లతో 'నగరంలో తడి- పొడి చెత్త విభజన, హోం కంపోస్ట్ పారిశుద్ధ్యం'పై సమీక్ష నిర్వహించారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్​లైన్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్​మెంట్ 2016 చట్ట ప్రకారం ఇళ్లు, ఆయా సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు తడి - పొడిగా విభజించి ఇవ్వాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు నివాసం ఉండే ప్రాంతాల్లో ముందుగా ఈ విభజన జరిపి... ప్రజలకు అవగాహన కల్పిచాలన్నారు. స్వచ్ఛ గుంటూరు సాధనకు చేస్తున్న పనిలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అలా చేయకపోతే జరిమానా విధిస్తాం..

నగరంలోని విద్యానగర్, సుగాలి కాలనీ, ద్వారక నగర్, తదితర ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్.. పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. విద్యానగర్ 1వ లైన్​లో పలు అపార్టమెంట్​ వాసుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. తడి-పొడి చేత్తగా విభజించి నగర పాలక సంస్థ సిబ్బందికి అందివ్వాలని ప్రజలకు సూచించారు. విభజించకుండా ఇస్తే కార్మికులు తీసుకోరని పేర్కొన్నారు.

అపార్టమెంట్ వాసులు తడి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయాలని.. పొడి వ్యర్థాలను మాత్రమే మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే నీటి కనెక్షన్ తొలగించడం, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

తనిఖీలు చేస్తున్న మున్సిపల్ కమిషనర్

ఇదీ చూడండి:

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

ABOUT THE AUTHOR

...view details