ఇళ్ల స్థలాల పంపిణీ పనులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ ఆదేశించారు. లబ్ధిదారులైన పేద ప్రజలకు హౌసింగ్ సైట్స్ రిజిస్ట్రేషన్ చేసే విషయంపై ఆర్డీవో భాస్కర్ రెడ్డితో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు కొన్ని నెలలుగా కష్టపడి భూములు సేకరించారని చెప్పారు.
'ఇళ్ల స్థలాల పంపిణీ పకడ్బంధీగా నిర్వహించాలి' - 'ప్రణాళిక ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీ పనులు పూర్తి చేయండి'
రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని గుంటూరు నగర కమిషనర్ అనురాధ తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ పనులు ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు.
'ప్రణాళిక ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీ పనులు పూర్తి చేయండి'
గుంటూరులో సుమారు 63 వేల మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. లబ్ధిదారుల వివరాలు, వారి ఫొటోలు, ఆధార్ కార్డులను త్వరితగతిన సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పూర్తి చేయాలన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా డాక్యుమెంట్లు పూర్తి చేయాలని సూచించారు.