కొవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో మెడికల్ ఆఫీసర్స్ మరింత సమన్వయంతో పని చేయాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు... క్షేత్ర స్థాయిలో అవసరమైన తోడ్పాటుని నగరపాలక సంస్థల నుండి అందిస్తామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెడికల్ ఆఫీసర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనురాధ, ఆఫీసర్స్ తప్పనిసరిగా వారి పరిధిలో బాధితులు, హోం క్వారంటైన్లో ఉన్న వారు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి సమగ్ర సమాచారం ఉండాలన్నారు.
'మరింత సమన్వయంతో పని చేయాలి' - gmc commissioner meeting with medical officials
క్షేత్ర స్థాయిలో వైద్య అధికారులకు అవసరమైన తోడ్పాటును అందిస్తామని గుంటూరు నగర కమిషనర్ అనురాధ తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
!['మరింత సమన్వయంతో పని చేయాలి' meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8041558-766-8041558-1594828776872.jpg)
నగరంలో ఉన్న 13 అర్బన్ హెల్త్ సెంటర్స్ మెడికల్ ఆఫీసర్స్ తమ పరిధిలోని ప్రాంతంలో ఇతర మెడికల్ ఆఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రతి రోజు పాజిటివ్ వచ్చిన కేసులను పర్యవేక్షణ చేయాలని, హోం ఐసోలేషన్‌లో ఎవరు ఉండాలో నిర్ణయించాలన్నారు. పెరుగుతున్న కేసుల రీత్యా మెడికల్ ఆఫీసర్, నగరపాలక అధికారులు ఒకే విధానం రూపొందించుకోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో మెడికల్ ఆఫీసర్స్కి సహకారంగా స్థానిక వార్డ్ సచివాలయాల కార్యదర్శులను కేటాయించామని.. ఎవరైనా విధులకు రాకుంటే నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.
ఇదీ చదవండి:మాచర్లలో సెంచరీ దాటిన కరోనా కేసులు