'విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండేలా చర్యలు' - precautions of corona virus guntur
కరోనాపై వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయిస్తున్నామని... అనుమానిత లక్షణాలు కలిగిన వారి సమాచారం సేకరించామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండేలా చర్యలు చేపట్టినట్లు ఆమె వివరించారు.
'విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండేలా చర్యలు'
పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేయడంతో పాటు... విదేశాల నుంచి వచ్చిన వారిని గృహాలకే పరిమితం చేయడం ద్వారా... కరోనా నివారణకు కృషి చేస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలన్నింటితో సమన్వయం చేసుకుంటూ... కొవిడ్ నివారణ చర్యలు వేగవంతం చేశామంటున్న అనురాధతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!