స్వగ్రామాలకు వెళ్లే దారిలోని సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆగిపోయిన రాజస్థాన్ వలస కూలీలకు పోలీసులు సాయం చేస్తున్నారు. గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలోని శ్రీనగర్ చెక్‌పోస్టును మూసేయటంతో ఎటూ వెళ్లలేక రోడ్డుపక్కనే నిలిచిపోయిన కూలీలకు... గురజాల రూరల్ సీఐ ఉమేశ్ అల్పాహారం అందించారు. హోటళ్లు సైతం ఎక్కడా లేకపోవటంతో... ఇబ్బంది పడుతున్నామని వలస కూలీలు సీఐకి చెప్పారు. ఏ రాష్ట్రం వాళ్లైనా బయటకు రావొద్దని... ప్రభుత్వం వారి వసతికి ఏర్పాట్లు చేస్తుందని సీఐ ఉమేశ్ చెప్పారు.
శ్రీనగర్ చెక్‌పోస్టు వద్ద ఆగిపోయిన రాజస్థాన్ వలస కూలీలు - శ్రీనగర్ చెక్‌పోస్టు వద్ద ఆగిపోయిన రాజస్థాన్ వలస కూలీలు
గుంటూరు జిల్లా శ్రీనగర్ చెక్‌పోస్టు వద్ద రాజస్థాన్ వలస కూలీలు ఆగిపోయారు. రోడ్డు పక్కనే ఆగిపోయినవారికి సీఐ ఉమేశ్ అల్పాహారం అందించారు. ఏ రాష్ట్రం వారైనా ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలకు ప్రభుత్వం వసతి ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.
gintur-ci-helping-to-migrant-laborers-of-rajasthan