'పెండింగ్ వేతనాలు అడిగితే.. ఉద్యోగాల నుంచి తొలగించారు' - జీజీహెచ్ లేటేస్ట్ న్యూస్
గుంటూరు జీజీహెచ్‌లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో వేతనాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని అడిగితే... తమని ఉద్యోగాల్లో నుంచి తొలగించారని ఔట్ సోర్స్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తమని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్‌లో నిరసన చేపట్టారు. గత 10 ఏళ్లుగా జీజీహెచ్‌లో పనిచేస్తున్న తమకు 15 నెలలు నుంచి వేతనాలు రావడం లేదని కోర్టుని ఆశ్రయిస్తే... తమని ఈనెల 16న ఉద్యోగాల నుంచి తొలగించాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నంవంబర్ 11న 40మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఆంద్రప్రదేశ్ ఔట్ సోర్స్ కార్పొరేషన్ లో చేర్చుకుని ధ్రువీకరణ పత్రాలు అందచేశారని చెప్పారు. దీంతో తెల్ల రేషన్ కార్డు, సంక్షేమ పథకాలు అన్ని తొలగించారని వాపోయారు. అటు ఉద్యోగం పోయి ఇటు సంక్షేమ పథకాలు పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు. తక్షణమే తమని విధుల్లోకి తీసుకోవలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:VARIETY REQUEST: బ్యాలెట్ బాక్స్‌లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్..