2021లో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి మంగళ, గురువారాల్లో గుంటూరు సర్వజనాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. వైద్యపరీక్షల నిమిత్తం రూ.1500 రుసుము చెల్లించాలన్నారు.
మెడికల్ సర్టిఫికెట్ నమూనా (రెండు ప్రతులు), రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఆసుపత్రికి రావాలని చెప్పారు. యాత్రకు 13 ఏళ్ల వయసు నుంచి 75 ఏళ్ల వరకే అర్హులన్నారు. పూర్తి వివరాలకు 99637 66638 నంబరు ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.