ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మీయ కలయిక... బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

40 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు వారంతా... ఆనాటి జ్ఞాపకాలు... వారంతా చదువుకున్న రోజులను నెమరువేసుకున్నారు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు.

get to gather in bapatla bapatla agriculture university
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By

Published : Mar 15, 2020, 7:34 AM IST

ఆత్మీయ కలయిక... బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల లో 1976-80 వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని హుషారుగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తరువాత తమ తమ స్నేహితులను కలిసికొని ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్​గా పని చేసిన ఎం మాలకొండయ్య ఐపీఎస్, రాష్ట్ర జీఎస్టీ అధిపతిగా పని చేసిన హరేరామ్ ఐఆర్ఎస్ వంటి వారు ఈ కళాశాల విద్యార్థులే. 40 సంవత్సరాల తరువాత కలిసిన వీరందరూ ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆ రోజుల జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, ఆనాటి స్నేహితులతో సరదాగా గడుపారు.

తమతో చదివిన పూర్వ విద్యార్థి కేఈ కృష్ణమూర్తి ప్రస్తుత ప్రిన్సిపల్​గా చేయటం తామందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాల మెుదలయ్యి 75 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న తరుణంలో తామంతా కలవటం మరుపురాని జ్ఞాపకమన్నారు. వీరితో చదువుకున్న కొందరు స్నేహితులు ఈ లోకంలో లేకపోయినా, వారితో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు.

ఇదీ చదవండి:విజయవాడలో నేటి నుంచి అందుబాటులోకి కోవిడ్-19 పరీక్ష కేంద్రం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details