గుంటూరు జిల్లాలోని ఏడు డీసీసీబీ సొసైటీల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ ఏడు బ్యాంకుల బ్రాంచి మేనేజర్లను సస్పెండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలోని డీసీసీబీ సొసైటీల్లో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం అత్యవసర సమావేశమైంది. డీసీసీబీ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి బ్యాంకు సీఈవోతోపాటు నాబార్డు నుంచి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సొసైటీల్లో అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణపై చర్చించారు.
సమావేశం తీర్మానాలు..
డీసీసీబీ సొసైటీల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసింది. ఏడు బ్యాంకుల బ్రాంచి మేనేజర్లపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు ఆయా సొసైటీల సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు సంబంధిత సొసైటీ అధ్యక్షులకు పాలకవర్గం సూచించింది. గుంటూరు, కొరిటపాడు, కాకుమాను, తుళ్లూరు, ఫిరంగిపురం, ఉండవల్లి, ప్రత్తిపాడు బ్రాంచి మేనేజర్లు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కార్యదర్శుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.