గుంటూరు జిల్లా తడివాకవారిపాలెంలో వంటగ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. గాలులు బలంగా వీచిన ఆ సందర్భంలో... 9 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గడ్డివాములు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 90 ఎకరాల గడ్డి వాములు కాలిపోయాయి. 50 బస్తాల ధాన్యం అగ్గి పాలైంది. ఒక్కో ఇంటికి లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెప్పారు. సర్వస్వం కోల్పోయామని ఆవేదన చెందారు.
వంటగ్యాస్ లీకై చెలరేగిన మంటలు... 9 పూరిళ్లు దగ్ధం - వంటగ్యాస్ లీకై పూరిళ్లు దగ్ధం వార్తలు
గుంటూరు జిల్లా తడివాకవారిపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వంటగ్యాస్ లీకై పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.
![వంటగ్యాస్ లీకై చెలరేగిన మంటలు... 9 పూరిళ్లు దగ్ధం gas leakage in home and houses are burned at tadivakavaripalem guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7538522-272-7538522-1591710169750.jpg)
వంటగ్యాస్ లీకై చెలరేగిన మంటలు... 9 పూరిళ్లు దగ్ధం