ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్లు - Fire accidents in Hyderabad

Fire accident in Hakeempe: తెలంగాణలోని హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లో ఆరంతస్తుల డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం ఎదురుగా ఉన్న గగన్‌విహార్‌లోని పార్కింగ్‌ స్థలంలో మంటలు చెలరేగి మూడు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా హకీంపేట్‌లోని ఓ స్టవ్‌ రిపేర్‌ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది

Fire accident in Hakeempe
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్లు

By

Published : Jan 22, 2023, 7:20 PM IST

Fire accident in Hakeempe: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లో ఆరంతస్తుల డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు ఆరినా.. ఇంకా భవనంలోకి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం ఎదురుగా ఉన్న గగన్‌విహార్‌లోని పార్కింగ్‌ స్థలంలో మంటలు చెలరేగి మూడు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా హకీంపేట్‌లోని ఓ స్టవ్‌ రిపేర్‌ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద సిలిండర్‌ నుంచి.. చిన్న సిలిండర్లలోకి గ్యాస్‌ నింపే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

భారీ పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాంబుల మాదిరి ఒక్కొక్కటిగా పేలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆందోళన చెందారు. స్థానికంగా ఉన్న దుకాణాలు మూసివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ మార్గంలో కాసేపు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా పెద్ద సిలిండర్ నుంచి చిన్న వాటిలోకి గ్యాస్ నింపుతుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, జీహెచ్​ఎంసీ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్లు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details