Ganta Srinivasa Rao Tweet: జగనన్న దెబ్బకు అమరావతికి మొహం చాటేసిన సంస్థల జాబితా చాలానే ఉందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ‘వై ఏపీ హేట్స్ జగన్’ (Why AP Hates Jagan) అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అందులో అమరావతి నుంచి తరలి వెళ్లిన సంస్థలను ప్రస్తావించారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు. కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌వైపే రావట్లేదని అన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం అమరావతిలో కేంద్రీయ కార్యాలయం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో గందరగోళాలు, నిర్లక్ష్యాలు జరగకుండా అమరావతి రాజధానిగా ఉండి ఉంటే.. ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాలు ఇప్పటికే అమరావతిలో ప్రారంభించి ఉండేవని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని.. ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడదామని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Industries in AP: వైఎస్సార్సీపీ ఎంపీకే వ్యాపారం చేయలేని పరిస్థితి.. వెళ్లిపోతున్న పరిశ్రమలు.. ఇది జగనన్న పాలన
అమవావతి నుంచి తరలి వెళ్లిన సంస్థల జాబితా:
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఎస్ఐడీ)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్)
- డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్
- ఇండియన్ నేవీ
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)
- కేంద్రీయ విద్యాలయ-1
- కేంద్రీయ విద్యాలయ-2
- నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం
- సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ)
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
- కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)
- సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐ)
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)
- భారత వాతావరణ సంస్థ (ఐఎండీ)
- విదేశ్ భవన్ (కేంద్ర విదేశాంగశాఖ ఆధ్వర్యంలో)
- నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)
- ఇండియన్ ఆర్మీ
- రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)
- జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడిఎస్ఐ)
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్
- ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఐసీఏడీఆర్)
- కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
- నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ)
- భారత జీవిత బీమా సంస్థ (ఎలస్ఐసీ)
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)
- న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్)
- సిండికేట్ బ్యాంక్ (ఆఫీస్ స్పేస్)
- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్' (హెచ్పీసీఎల్)
- రెయిల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)
- భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)
- ఇండియన్ బ్యాంక్ హడ్కో రీజినల్ ఆఫీస్
- విజయా బ్యాంక్
- కెనరా బ్యాంక్
- గెయిల్ ఇండియా లిమిటెడ్
Nara Brahmani Tweet On AP Industries : ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయి.. వైసీపీ ప్రభుత్వ ఎజెండా ఏమిటి? : బ్రాహ్మణి
ఇలా ఎన్నో సంస్థలు మోహం చాటేశాయని.. అమరావతికి.. జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన వలన రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని మండిపడ్డారు. చరిత్ర పుటల్లో ఆంద్రప్రదేశ్‌ను అట్టడుకు నెట్టడంలో మనం బాగస్వామ్యులం కాకుండా ఓటు అనే ఆయుధంతో 2024లో ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి మన రాష్ట్ర భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుందామని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ షాక్.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు..