ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి తరలింపును అడ్డుకున్న పోలీసులు.. 9 మంది అరెస్ట్ - guntur crime news

గుంటూరు జిల్లాలో గంజాయి సరఫరా చేస్తున్న 9 మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

sp
తాడేపల్లిలో 9మంది గంజాయి సభ్యుల ముఠా అరెస్ట్

By

Published : Mar 7, 2021, 7:52 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 9 మంది సభ్యుల గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వాహనంలో తీసుకువస్తున్న 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి... గుంటూరు జిల్లాలో భారీ మొత్తానికి అమ్ముతున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

లాక్ డౌన్ కాలంలో కొందరు గంజాయికి అలవాటు పడ్డారని.. వీరిలో కొందరు సరుకు సరఫరాదారులుగా మారారని ఎస్పీ చెప్పారు. గతంలో లిక్విడ్ గంజాయి రవాణాను అదుపు చేశామని.. ఇలాంటి వ్యవహారాలపై నిఘా నిరంతంరం కొనసాగుతుందని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details