వైజాగ్ నుంచి విజయవాడ, తాడేపల్లి ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్న 8 మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 92 కేజీల గంజాయి, 40 వేల నగదు, టాటా ఏస్ వాహనం, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ - ganja news in vijayawada
వైజాగ్ నుంచి విజయవాడకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేసి 92 కేజీల సరకు సీజ్ చేసినట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
ganja gang arrestd in guntur dst transport from guntur to Vijayawada
విజయవాడ కేంద్రంగా చేసుకుని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తునట్లు అర్బన్ ఎస్పీ వివరించారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరస్తుల కదిలికలపై నిరంతర నిఘా ఉంటుందని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చూడండి
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్