ఇదీ చదవండి:
కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత - క్రైమ్ వార్తలు
అక్రమంగా కారులో చైన్నైకి తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజా టోల్‌గేట్ వద్ద 50 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి చెన్నైకి కారులో గంజాయి తరలిస్తుండగా.. కాజా టోల్ ప్లాజా వద్ద మాటువేసిన పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను చూడగానే.. నిందితుడు కారు వదిలి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారైన వ్యక్తికోసం గాలింపు చేపట్టారు.
కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత