రెమ్‌డెసివిర్ మందులు విక్రయిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను.. గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో మరో ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు.
వీరి నుంచి 8 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా వేళ కాసులకు కక్కుర్తిపడి ఈ ముఠాలు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ విషయంలో ఆసుప్రతుల పాత్రపైనా విచారణ చేస్తున్నామని ఏఎస్పీ ఎన్‌వీఎస్ మూర్తి తెలిపారు.