కాబోయే భర్త కాళ్లు చేతులను కట్టేసి.. కదిలితే పీక కోసేస్తామంటూ బెదిరించి అతడి కళ్లెదుటే యువతిపై అత్యంత క్రూరంగా ఇద్దరు దుండగులు అత్యాచారం జరిపిన దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో.. సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ముఖాన్ని ఇసుకలో కుక్కేసి, ఊపిరాడనివ్వకుండా చేసి పాశవికంగా అకృత్యానికి పాల్పడ్డారు.
విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన 20ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని శిక్షణలో భాగంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సేవలందిస్తున్నారు. శనివారం రాత్రి ఎనిమిదింటికి విధులు ముగిశాక కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కరఘాట్ వైపు వచ్చారు. నది లోపలికి వెళ్లి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ మాటేసిన ఇద్దరు దుండగులు వీరి కదలికలు గమనిస్తూ వెనుకవైపు నుంచి ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. బ్లేడ్లు చూపుతూ చంపేస్తామని బెదిరించారు. యువకుడిని పక్కకు ఈడ్చేసి బాధితురాలి చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దుండగుల్లో ఒకడు బ్లేడును యువకుడి మెడపై ఉంచి బెదిరించాడు. మరొకడు యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత రెండో దుండగుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బాధితులు కేకలు వేసినప్పటికీ ఈ ప్రాంతం రోడ్డుకు దూరంగా ఉండడంతోపాటు చిమ్మ చీకటి కావడంవల్ల ఎవరికీ వినిపించలేదు. యువ జంట వద్దనున్న సెల్‌ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదుద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు. కొద్దిసేపటికి బాధితులు తేరుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు విషయం తెలుసుకుని తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
నాటు పడవలో పరారీ
అత్యాచారం చేశాక నిందితులిద్దరూ నాటు పడవలో నదీ మార్గంలో విజయవాడవైపు పారిపోయారు. దీంతో వారు విజయవాడవైపు నుంచి వచ్చిన బ్లేడ్ బ్యాచ్ అయి ఉంటారని అనుమానిస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న రైల్వే వంతెనలపై నుంచి విజయవాడ మార్గం గుండా బ్లేడ్ బ్యాచ్ దుండగులు సీతానగరంవైపు నిత్యం వస్తుంటారు. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి దోచుకుంటారు. తాజా ఉదంతంలోనూ వారే దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత యువకుడితో కలిసి పోలీసులు నదీతీరంలో గాలించారు. అనుమానితులను చూపించారు. బాధిత యువతికి చిత్రాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ సమాచారం సేకరించారు.
సంఘటనా స్థలంలో నీళ్ల సీసా, చిరిగిన దుస్తులు
సంఘటనా స్థలం వద్ద బాధితురాలు తెచ్చుకున్న నీళ్ల సీసా, ఆమె సెల్‌ఫోన్ బ్యాక్‌పౌచ్, చిరిగిన కొన్ని దుస్తుల ఆనవాళ్లున్నాయి. అక్కడే రెండు బీరు సీసాలూ ఉన్నాయి. తాజాగా అత్యాచారం జరిగిన రైల్వే వంతెన కింది భాగం, సీతానగరం పుష్కర ఘాట్ ప్రాంతమంతా అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ‘ఈనాడు’ ప్రతినిధి ఆదివారం అక్కడ పరిశీలించగా.. గంజాయి పీల్చుతూ కొందరు, మద్యం తాగుతూ మరికొందరు కనిపించారు.
ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో అనుమానం వచ్చింది..