గుంటూరు జిల్లా మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఏడుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. మేడికొండూరు, సత్తెనపల్లి మండలాల పాత నేరస్థులను అనుమానితులుగా భావించిన పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి 6 కిలోమీటర్ల దూరంలో కొత్తగా శీతల గిడ్డంగి నిర్మాణం జరుగుతోంది. గురువారం ఉదయం ఘటనాస్థలానికి వెళ్లిన జాగిలం ఆ శీతలీకరణ కేంద్రం వైపు వెళ్లి ఆగింది. అందులో ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారితో పాటు స్థానికులు కూడా పని చేస్తున్నారు. వారిలో 20 మంది నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు.
gang rape case: పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు ... - paladugu women gang rape case latest news
మహిళపై సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనాస్థలిని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. ఈ కేసులో ఏడుగురు అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుంటూరు సామూహిక అత్యాచారం కేసు