గుంటూరుజిల్లా తుళ్ళూరు మండలం మందడం శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి శోభాయాత్ర సందడిగా సాగింది.వినాయక లడ్డు వేలం పాటలో మాదాల భువనేశ్వర్5లక్షల55వేల116రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు.ఈ ఉత్సవానికి తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు.వినాయకుడు శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ దేవుళ్ల ప్రతిమలు ఆకట్టుకున్నాయి.భారీ ఊరేగింపుల మధ్య గణేశుణ్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
ఘనంగా వినాయకుడి శోభాయాత్ర
గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది.
మళ్లీ రావయ్య..బొజ్జ గణపయ్య