ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 4:01 PM IST

ETV Bharat / state

గుంటూరులో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్చతే సేవ కార్యక్రమం నిర్వహించారు.

Gandhi Jayanti celebrations in Guntur
గుంటూరులో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చతే సేవ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్, నగర కమిషనర్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్చ భారత్ - స్వచ్చతే సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యారామిరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మద్యం విమోచన కమిటీ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, కమిషనర్ చల్లా అనూరాధ పాల్గొన్నారు.

మహాత్ముడు స్వాతంత్య్రంతోపాటూ...దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలనే... సందేశాన్ని ఇచ్చారని...రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ ఆయోధ్య రామిరెడ్డి అన్నారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి నాటికి స్వచ్చ గుంటూరు స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతీ మనిషికి స్వచ్ఛమైన నీరు, వాతావరణాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పర్యావరణాన్ని , పరిసరాలను ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలని...తద్వారా స్వచ్ భారత్ నిర్మించుకోగలమన్నారు.

ఇదీ చదవండి:

'ఉపాధి హామీ పనుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details