గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారం జగన్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకేఅధికారం కోరుకుంటున్నారనిగల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు, నాగులపాడులలో డొక్కా మాణిక్యవరప్రసాద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పిన మోదీపై తెదేపా పోరాటం చేస్తుంటే... ప్రతిపక్షనేత జగన్ వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.ఆంధ్ర ద్రోహులైన మోదీ, కేసీఆర్తో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాన్ రాష్ట్రంలో ఉంటే, స్విచ్ తెలంగాణలో ఉందని.. దాని ఫ్యూజ్ దిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాసంక్షేమంకోసం పాటుపడుతున్న చంద్రబాబును గెలిపించాలని కోరారు. గుంటూరు ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..