ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాకు 25 ఎంపీ సీట్లు! - TDP MEET

ప్రధాని మోదీ పీఠం కదిలిందని, ఇంటిదారి పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా 25 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎంపీ గల్లా జయదేవ్

By

Published : Mar 7, 2019, 6:06 PM IST

ఎంపీ గల్లా జయదేవ్
ప్రధాని నరేంద్రమోదీ పీఠం దిగే రోజులు దగ్గర పడ్డాయని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. ప్రధాని హామీలు తీర్చలేకపోయారని గుంటూరు తెదేపా కార్యాలయంలో వ్యాఖ్యానించారు. మోదీ మాటలు నీటిమూటలని ప్రజలు గుర్తించారన్నారు. దేశ మత సామరస్యం దెబ్బతీనేలా భాజపా చర్యలు ఉన్నాయన్న గల్లా.. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు తెదేపానే గెలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details