గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన బోదపాటి కోటీశ్వరావు (60) పనికి ఆహార పథకం కింద ఉపాధి కూలీగా పనులకు వెళ్తున్నాడు. రోజు లాగే పనికి వెళ్ళాడు కోటేశ్వరావు.. పనిముగించుకొని ఇంటికి బయలుదేరాడు. తోటి కూలికు చెందిన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గంలో బండి అదుపుతప్పి రోడ్ పక్కన ఉన్నలంకలోనికి దూసుకుపోయింది. బండి మీద ఉన్న ముగ్గురూ కింద పడ్డారు. కోటీశ్వరావు చేతిలో ఉన్న గడ్డపలుగు ప్రమాదవ శాత్తు అతని కడుపులోనే గుచ్చుకుంది. చికిత్స నిమిత్తం బాధితుడిని మేడికొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొద్ది సేపటికే కోటీశ్వరావు మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. తోటి కూలి మరణించిన ఘటన కూలీలను కలసి వేసింది.
పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తూ కూలీ మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు
పొట్ట కూటి కోసం ఆ వ్యక్తి ఉపాధి పనులకు వెళుతుండాడు. పని నిమిత్తం తన వెంట తీసుకెళ్లిన గడ్డపార ప్రమాదవ శాత్తు కడుపులో గుచ్చుకుని ఉపాధి కూలి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు మేడికొండూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...
man dead