ఓవైపు కరోనా చనిపోయిన వారి మృతదేహాలు.. మరోవైపు వైరస్ నిర్ధరణ పరీక్షలు.. ఇంకో వైపు చికిత్స కోసం రోగుల ఎదురుచూపులు.. ఇదీ గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దయనీయ పరిస్థితి. జీజీహెచ్ మెుత్తం కొవిడ్ రోగులతోనే నిండిపోయింది. ఆసుపత్రిలో చికిత్సకు పడకలు లేక.. ఆసుపత్రి పరిసరాల్లో కరోనా బాధితులు నేలపైనే పడుకుంటున్నారు. కొందరు కుర్చీల్లో, మరికొందరు సమీప ప్రాంతాల్లో అగచాట్లు పడుతున్నారు.
జీజీహెచ్ కు కరోనా రోగుల తాకిడి..పెరుగుతుండడంతో పడకలు సరిపోవడం లేదు. మరిన్నివార్డులను కొవిడ్ రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.