ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం: శ్రీరంగనాథ రాజు - Narasaraopet news

నరసరావుపేటలో పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా... ఉప్పలపాడు గ్రామం వద్ద ఇళ్ల నిర్మాణానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు శంకుస్థాపన చేశారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన 100 ఎకరాల విస్తీర్ణంలో 5 వేల గృహాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

శ్రీరంగనాథ రాజు
శ్రీరంగనాథ రాజు

By

Published : Jun 9, 2021, 8:19 PM IST

పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. అన్ని వసతులతో ఇళ్లు నిర్మించేలా వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ... ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో విఫలమయ్యాయని... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details