ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోలులో నీళ్లు.. ఆగ్రహించిన వాహనచోదకులు

గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పెట్రోలు బంకులో ఇంధనంతో పాటు నీరు వస్తోందని వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తెనాలి తహసీల్దార్, సిబ్బందితో కలిసి పెట్రోలు బంకు వద్దకు వెళ్లి.. ట్యాంకర్లలోని ఇంధనాన్ని పరీక్షించారు. అది మామూలుగానే ఉన్నట్టు గుర్తించారు. పైపు లైన్లలో ఎక్కడైనా సమస్య ఎర్పడి ఉండవచ్చని భావించారు. ఈ విషయంపై.. ఇంధన కంపెనీకి సమాచారం ఇచ్చి తనిఖీ చేయించాలని బంకు యజమానుల్ని ఆదేశించారు.

fuel-and-water-at-a-petrol-station-in-tenali-guntur-district
పెట్రోల్లో నీరు చూసి ఆగ్రహించిన వాహనదారులు

By

Published : Dec 20, 2020, 8:57 AM IST

పెట్రోలు బంకులో ఇంధనంతో పాటు నీరు వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని శివాజీ చౌక్ పెట్రోల్ బంకులో జరిగింది. బండి స్టార్ట్ కాకపోవటంతో అనుమానం వచ్చిన వాహనదారులు ట్యాంకర్లోని పెట్రోల్ తీసి చూడగా నీరు ఉన్నట్లు తేలింది. బాటిళ్లలో పెట్రోల్ పోయించుకున్న వారికి ఇదే సమస్య ఎదురైంది.

విషయం తెలుసుకున్న తెనాలి తహసీల్దార్ రవిబాబు, సిబ్బందితో కలిసి పెట్రోలు బంకు వద్దకు చేరుకున్నారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లలోని ఇంధనాన్ని పరీక్షించగా అది మామూలుగానే ఉన్నట్టు తేల్చారు. పైపు లైన్లలో సమస్య ఎర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంధన కంపెనీకి సమాచారం ఇచ్చారు. తనిఖీ చేయించాలని బంకు యజమానుల్ని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details