ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమికురాలి కోసం స్నేహితుడి హత్య.. - MURDER ABDULLAHPUR MET

Killing a friend for a lover: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్​మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. తాను మనసుపడిన అమ్మాయి.. తన స్నేహితుడికి దగ్గరవుతోందని భావించి ఏకంగా అతన్నే అత్యంత పాశవికంగా హత్యచేశాడు. పార్టీ చేసుకుందామని పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Killing
హత్య

By

Published : Feb 25, 2023, 3:22 PM IST

ప్రేమికురాలి కోసం స్నేహితుడి హత్య

Killing a friend for a lover: ప్రేమించిన అమ్మయితో చనువుగా ఉంటున్నాడని.. ఓయువకుడు తన స్నేహితుడనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్​మెట్​లో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బోడుప్పల్​లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న హరహరకృష్ణ.. స్నేహితుడు నవీన్​ను దారుణంగా కొట్టి చంపాడు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెలంగాణలోని దిల్​సుఖ్ నగర్​లోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో హరహరకృష్ణ, నవీన్, ఓ యువతి.. క్లాస్ మెట్స్. నవీన్, హరహరకృష్ణ ఇద్దరూ ఈ అమ్మాయినే ప్రేమించారు.

అయితే ఆ యువతి మాత్రం నవీన్​తో చనువుగా ఉండేది. దీనిని జీర్ణించుకోలేని నిందితుడు హరహరకృష్ణ.. నవీన్ హత్యకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్​ను ఈ నెల 17 సాయంత్రం ఫోన్ చేసి ఓఆర్​ఆర్ వద్దకు పిలిపించిన హరిహరకృష్ణ.. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు.

నవీన్ ఆచూకీ కనిపించడం లేదని తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో హత్య కుట్ర బయటపడింది. నల్గొండలోని మహత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నవీన్ ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వర్సిటీ అధికారులు.. ఈ నెల 19న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు నవీన్ స్నేహితులను వాకబు చేయగా తన స్నేహితుడు హరహరకృష్ణ ఫోన్ చేయగా బయటకువెళ్లినట్లు చెప్పారు. దీంతో హరహరకృష్ణకు ఫోన్ చేసిన నవీన్ తల్లిదండ్రులు తమ కుమారుడి గురించి ఆరాతీయగా.. తన వద్దకు వచ్చి అదేరోజూ తిరిగి వెళ్లినట్లు హరహరకృష్ణ సమాధానం ఇచ్చాడు.

దీంతో అన్నిచోట్లా ఆరాతీసిన నవీన్ తల్లిదండ్రులు.. ఫలితం లేకపోవడంతో 22న నార్కట్​పల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హరహరకృష్ణపై అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తులో భాగంగా హరహరకృష్ణను విచారించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఫోన్ స్వీచ్ఛాప్ చేసుకొని పరారీలో ఉన్నాడు. పోలీసులు, స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరగడంతో నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయిన హరహరకృష్ణ.. నవీన్​ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన ప్రియురాలిని నవీన్ ఎక్కడ దక్కించుకుంటాడనే అసూయతోనే విచక్షణా రహితంగా కొట్టి చంపానని, మృతదేహాన్ని హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి అబ్దులాపూర్ మెట్​లో పడేశానని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ వద్ద నవీన్‌ బంధువుల ఆందోళన :

హరహర కృష్ణను అదుపులోకి తీసుకొని అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి విషయంలో 17వ తేదీ నవీన్.., హర హర కృష్ణ గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కింద పడిపోయిన నవీన్ గొంతు పట్టి హరహర కృష్ణ ఊపిరాడకుండా చేశాడు. నవీన్ మృతిచెందాక తన వెంట తెచ్చుకున్న కత్తితో తల మొండెం వేరు చేసి... నవీన్ గుండెను చీల్చి, మర్మాంగాలను కోసి, చేతి వేళ్లను కట్ చేశాడు. డి-మార్ట్‌లో రెండు నెలల క్రితం హరహర కృష్ణ కత్తిని కొనుగోలు చేశాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details