ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన కార్యక్రమం

ఆరుగాలం శ్రమించి... పంటలను అమ్ముకునేందుకు యార్డులకు వచ్చే రైతులు.. సరైన భోజన వసతులు లేక ఇబ్బందులు పడేవారు. దీంతో పాలక వర్గం.. గుంటూరు మార్కెట్ యార్డులో భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక్కో భోజనానికి రూ.54 వెచ్చించి అన్నదాతల కడుపు నింపుతోంది.

By

Published : Apr 8, 2021, 6:07 PM IST

గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన కార్యక్రమం
గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన కార్యక్రమం

గుంటూరు మిర్చి యార్డులో ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభమైంది. మార్కెట్ సమీపంలో భోజన వసతి లభించక, రైతుల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పాలకవర్గం దీనికి శ్రీకారం చుట్టింది. ఒక్కో భోజనానికి 54 రూపాయలు వెచ్చించనున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి మెరుగైన మెనూ నిర్ణయించారు. కోడిగుడ్డు, స్వీట్, గడ్డ పెరుగు ఉండేలా మార్గదర్శకాలు రూపొందించారు.

వాస్తవానికి ఉచిత భోజన పథకం చాలాకాలం కిందటే మొదలవ్వాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్, పాలకవర్గం గడువు ముగియటంతో ఈ కార్యక్రమం నెలరోజులకు పైగా వాయిదా పడింది. సరకు అధికంగా వచ్చే రోజుల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ఆచితూచి పంటను యార్డుకు తెచ్చుకోవాలని ఛైర్మన్ ఏసురత్నం సూచిస్తున్నారు.

ఇవీ చదవండి

ఉయ్యందనలో వైకాపా రిగ్గింగ్​కు పాల్పడిందని తెదేపా నేతల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details