రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో రైతులు గుండె పోటుతో మరణించడం.. వైద్యులను కదిలించింది. ఇలాంటి మరణాలను ఆపేందుకు ముందు జాగ్రత్తగా రాజధాని ప్రాంత వాసులకు సరైన వైద్యం అందించేందుకు గుంటూరు వైద్యులు ముందడుగు వేశారు. మందడంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. 12 రకాల విభాగాల్లో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపీణి చేస్తున్నారు.
మందడంలో ఉచిత వైద్య శిబిరం
రెండు నెలలుగా అమరావతి ఉద్యమంలో ఉద్ధృతంగా పాల్గొంటున్న రైతులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. తరలింపు వేదనతో రైతులు గుండె పోటుతో మృతి చెందుతున్నారని.. ముందు జాగ్రత్తగా తమ వంతు ప్రయత్నంగా ఉచిత వైద్యం చేసేందుకు ముందుకొచ్చామంటున్నారు గుంటూరు వైద్యులు.
free-health-camp-in-madhadam